సంగారెడ్డి జిల్లా పరిధిలోని మునిపల్లి మండల రెడ్డిపల్లికి చెందిన బిక్షపతి... పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామానికి నాలుగు సంవత్సరాల క్రితం బ్రతుకుదెరువు కోసం వచ్చి... అక్కడే కూలీ పనులు చేసుకుంటూ ఉండేవాడు.
మద్యానికి బానిసై... అప్పులు తీర్చలేక వ్యక్తి ఆత్మహత్య - వ్యక్తి ఆత్మహత్య
మద్యానికి బానిసై అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఠాణా పరిధిలో చోటు చేసుకుంది.
మద్యానికి బానిసై... అప్పులు తీర్చలేక వ్యక్తి ఆత్మహత్య
మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో భార్య సుమలత ఇద్దరు పిల్లలను తీసుకుని ఈనెల 1వ తేదీన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి భిక్షపతి ఒంటరిగానే ఉంటున్నాడు. అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెంది ఇంట్లోని సీలింగ్ రాడ్డుకు చీరతో ఉరివేసుకున్నాడు. ఇంటి యజమాని చూసి మృతుని భార్యకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:అప్పుల బాధ తాళలేక రైతు బలవన్మరణం