సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని కాకివాగులో కొట్టుకుపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఇవాళ గుర్తించినట్టు తహసీల్దార్ నాగరాజు తెలిపారు. ఈ నెల 26న కురిసిన భారీ వర్షాలకు వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. ఈ సమయంలో వంతెన మీది నుంచి వాగు దాటేందుకు ప్రయత్నించగా... గ్రామానికి చెందిన మారుతి అనే వ్యక్తి కొట్టుకుపోయాడు.
కాకివాగులో గల్లంతైన వ్యక్తి కంబాపూర్లో శవమై తేలాడు - కాకివాగులో గల్లంతై కంబాపూర్లో తేలాడు
నాలుగు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం కాకివాగులో గల్లంతైన వ్యక్తి మృతదేహం... కామారెడ్డి జిల్లా కంబాపూర్ వాగులో లభించింది. నాలుగు రోజులుగా గాలిస్తున్నా... దొరకకపోవడం వల్ల ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో వెతికినట్టు కంగ్టి తహసీల్దార్ నాగరాజు తెలిపారు.
కాకివాగులో గల్లంతైన వ్యక్తి కంబాపూర్లో శవమై తేలాడు
గల్లంతైన మారుతి ఆచూకీ లభించకపోవడం వల్ల... నాలుగు రోజులుగా గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా దొరకలేదు. దీంతో ఇవాళ ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాయంతో వెతికారు. కామారెడ్డి జిల్లా కంబాపూర్ వద్ద వాగులో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మారుతి మృతదేహాన్ని గుర్తించాయి.
ఇదీ చూడండి:చిన్నారిని ఢీ కొట్టిన టిప్పర్ లారీ.. చికిత్స పొందుతూ మృతి