తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నిండు ప్రాణాన్ని బలిగొన్న భూతగాదా.. మృతదేహంతో బంధువుల ఆందోళన

భూతగాదా నేపథ్యంలో ఓ కుటుంబం చేసిన దాడిలో గాయాలపాలై చికిత్స పొందుతూ నర్సింహులు అనే వ్యక్తి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు.

man killed in land quarrels in kamareddy district
నిండు ప్రాణాన్ని బలిగొన్న భూతగాదా.. మృతదేహంతో బంధువుల ఆందోళన

By

Published : Nov 5, 2020, 11:57 AM IST

భూ తగాదాలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ఓ కుటుంబం చేసిన దాడిలో వ్యక్తి తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాడికి పాల్పడిన వ్యక్తి ఇంటి ముందు మృతదేహంతో మృతుడి బంధువులు బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కామారెడ్డి మండలం సరంపల్లి గ్రామానికి చెందిన ఆకుల చిన్న నర్సింహులు (50), అతని ఇద్దరి అన్నదమ్ములకు కామారెడ్డి మండలం క్యాసంపల్లి శివారులో 325 సర్వే నంబరులో 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 1985 నుంచి నర్సింహులు సాగు చేసుకుంటున్నారు.

నాలుగు రోజుల క్రితం కామారెడ్డి పట్టణానికి చెందిన దేవుల రాజేందర్ అతని కుటుంబ సభ్యులతో కలిసి నర్సింహులుకు సంబంధించిన భూమి తమదే అంటూ ఇక్కడ మీకు స్థలం లేదంటూ ఆ స్థలంలో బోరు వేయడానికి వచ్చారు. ఈ విషయంలో వ్యవసాయ భూమి వద్ద ఉన్న నర్సింహులుపై దేవేందర్ కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ దాడిలో నర్సింహులుకు తీవ్ర గాయాలు కావడం వల్ల నిజామాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నర్సింహులు బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. దెబ్బలు తాళలేకనే నర్సింహులు మృతి చెందాడని బంధువులు మృతదేహంతో దేవేందర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. నర్సింహులు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: ఫెరారీ కారును దొంగిలించేందుకు సినీ ఫక్కీలో ప్లాన్..

ABOUT THE AUTHOR

...view details