తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భార్యను కత్తితో చంపేసి పారిపోయిన భర్త - man killed his wife and found missing

భార్యను హత్య చేసి భర్త పరారైన సంఘటన మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా పాండు బస్తీలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలిని కత్తితో చంపినట్లు ప్రాథమిక నిర్ధరణ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

in suraram man killed his wife
సురారంలో భార్యను కత్తితో చంపేసి పారిపోయిన భర్త

By

Published : Aug 24, 2020, 7:34 AM IST

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పరిధిలో సురారం పాండు బస్తీలో దారుణం చోటు చేసుకుంది. భార్య కాశిబాయిని హత్య చేసి భర్త మాధవ్ పరారయ్యారు. మహారాష్ట్రకు చెందిన వీరు మూడేళ్ల క్రితమే వివాహం చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం నగరానికి వచ్చిన వీరు ఓ రూం అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు.

వీరిద్దరూ తరచుగా గొడవపడుతుండగా.. భార్యను హతమార్చి మాధవ్​ పరారయ్యాడు. తల్లి కులుబాయి పనికి వెళ్లి వచ్చేసరికి కూతురు విగతజీవిగా పడి ఉండటం చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలిని కత్తితో చంపినట్లు ప్రాథమిక నిర్ధరణ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:వ్యాక్సిన్​ ట్రయల్స్ ఆలస్యంపై ట్రంప్ మండిపాటు

ABOUT THE AUTHOR

...view details