మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ ఎస్సార్ నగర్ పరిధిలోని గోల్డెన్ కేఫ్ బార్లో క్యాషియర్‌గా పనిచేసే శ్రీనివాస్ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. బార్లోకి వర్షపు నీరు ప్రవేశించగా.. దుకాణంలో నుంచి బయటకు వస్తున్న క్రమంలో శ్రీనివాస్‌కు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించినట్లు మేనేజర్ సుబ్బారెడ్డి తెలిపారు.
ఎస్సార్ నగర్లో కరెంట్ షాక్ తగిలి.. బార్ క్యాషియర్ మృతి - ఎస్సార్ నగర్లో వర్షాలు వార్తలు
హైదరాబాద్ ఎస్సార్‌నగర్‌లో కురిసిన భారీ వర్షం నేపథ్యంలో బార్లో క్యాషియర్‌గా పనిచేసే వ్యక్తి విద్యుత్ షాక్‌తో మరణించాడు. బార్లోకి ఒక్కసారిగా వరదనీరు రాగా.. ఈ క్రమంలో బయటకు వెళ్లిన క్యాషియర్‌కు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఎస్సార్ నగర్లో కరెంట్ షాక్ తగిలి.. బార్ క్యాషియర్ మృతి
బార్లోకి పెద్ద ఎత్తున వరదనీరు రాగా.. క్యాషియర్ బయటకు వెళ్తుండగా షాక్ తగిలిందని మేనేజర్ పేర్కొన్నారు. అతన్ని రక్షించే క్రమంలో తాము భయపడి వెనక్కి వెళ్లామని మేనేజర్ తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:భారీగా వరదనీరు చేరి నిండుకుండలా మారిన హిమాయత్‌సాగర్