ఆన్లైన్ లోన్ వేధింపులు మరో ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి శ్రావణ్ అనే యువకుడు ఆన్లైన్ ద్వారా 16వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లింపులో ఆలస్యమవడం వల్ల ఆ సంస్థ ప్రతినిధులు పలుమార్లు అడిగారు. నోటీసులు పంపడంతో పాటు... వాట్సాప్‌లో శ్రావణ్‌ను తిరిగి చెల్లింపుల గురించి ఒత్తిడి చేశారు.
ఆన్లైన్ లోన్ వేధింపులకు మరో ప్రాణం బలి - Narsapur latest news
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ లోన్ వేధింపులు భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు వాపోయారు.
ఆన్లైన్ లోన్ వేధింపులకు మరో ప్రాణం బలి
బంధువులకు సైతం ఫోన్ చేసి... అప్పు గురించి చెప్పారు. అవమానంగా భావించి శ్రావణ్ నిన్న రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ పరిస్థితి మరొకరికి రాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
- ఇదీ చదవండి:నీటికుంటలో పడిపోయిన కారు.. చిన్నారి మృతి