విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. ఆ విలాసాలకు నెలనెలా వచ్చే జీతం చాల్లేదు. ఇంకేం... పని చేస్తున్న సంస్థకే కన్నం వేశారు. 38 తులాల బంగారం, కొంత నగదును లెక్కలు చూపకుండా ఎత్తుకెళ్లి చివరకు అడ్డంగా దొరికిపోయారు. మహబూబ్‌నగర్‌లోని సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో పనిచేసే నలుగురు వ్యక్తులు బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లి, ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునేవాళ్లు. మాల్‌లో ఆడిటింగ్ జరిగినప్పుడల్లా ఏదో విధంగా డబ్బు తీసుకొచ్చి పెట్టి... అనుమానం రాకుండా చూసుకునే వాళ్లు.
'అన్నం పెట్టిన సంస్థకే కన్నం వేసిన ఉద్యోగులు' - మహబూబ్‌నగర్ క్రైమ్ వార్తలు
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సీఎంఆర్ మాల్‌లో జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు. నిందితుల నుంచి 38 తులాల బంగారు ఆభరణాలు, 6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రెమారాజేశ్వరి వెల్లడించారు.
కాని మాల్‌లో నగదు, నగల లెక్కల్లో తరచూ తేడాలు రాగా... ఇటీవల జరిగిన ఆడిటింగ్‌లో అడ్డంగా దొరికిపోయారు. పోలీసులు దర్యాప్తు చేసి దొంగతనం తీరును ఛేదించారు. నిందితుల నుంచి 38 తులాల బంగారు ఆభరణాలు, 6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రెమారాజేశ్వరి వెల్లడించారు. బుజ్జి అనే నిందితుడు పరారీలో ఉండగా.. త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. ఫైనాన్స్ సంస్థల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ ఆరా తీయనున్నారు.
ఇవీ చూడండి:ఉద్యోగాల భర్తీపై సర్కారు చేతులెత్తేసింది : కోదండరాం