సిద్దిపేట జిల్లా వెంకటాపూర్‌కు చెందిన ఆనంద్ అదే గ్రామానికి చెందిన హారిక ప్రేమించుకున్నారు. వారి కులాలు వేరు కావటంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ నెల 8న వెంకటాపూర్ నుంచి వెళ్లిపోయిన ఆనంద్, హారిక ఊరి దగ్గరలోని మామిడితోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. శనివారం మామిడితోటలోని ఓ గదిలో వారిని గుర్తించిన ఆనంద్ తండ్రి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. కలిసే అనంతలోకాలకు వెళ్లిపోయారు! - వెంకటాపూర్
వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. వారి కులాలు వేరు కావటంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. మనస్తాపం చెందిన ఆ జంట పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం అబ్బాయి చనిపోగా.. ఆదివారం తెల్లవారుజామున అమ్మాయి మృతి చెందింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వెంకటాపూర్‌లో జరిగింది.
సిద్దిపేట జిల్లా వెంకటాపూర్‌లో ప్రేమజంటఆత్మహత్య
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారు మృతి చెందింది. శనివారం సాయంత్రం ఆనంద్ చనిపోగా... ఆదివారం తెల్లవారుజామున హారిక మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:'దిశ ఎన్కౌంటర్'ను సినిమాగానే చూడండి: నట్టి కుమార్