తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బాలిక మైనర్... కులాలు వేరు... ప్రేమజంట ఆత్మహత్య! - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

కొన్నాళ్ల వారి పరిచయం ప్రేమగా మారింది. వయసుతో సంబంధం లేకుండా ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ అమ్మాయి మైనర్ కావడం... వారి కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెందారు. కలిసి జీవించ లేకపోయినా మృత్యువులో ఒక్కటయ్యారు.

lovers suicide at undyala village in narayanpet district
బాలిక మైనర్... కులాలు వేరు... ప్రేమజంట ఆత్మహత్య!

By

Published : Dec 18, 2020, 7:37 PM IST

వయసుతో సంబంధం లేకుండా వారిద్దరి పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ప్రణయాన్ని పరిణయంగా మార్చుకుందాం అనుకున్నారు. కానీ కులాలు వారికి అడ్డుపడ్డాయి. పెద్దలను ఒప్పించి ఒక్కటవ్వలేని వారు ఉసురు తీసుకోవడమే శరణ్యమనుకున్నారు. ఇద్దరూ కలిసి బలవన్మరణానికి పాల్పడ్డారు.

నారాయణపేట జిల్లా నర్వ మండలం లంకల గ్రామానికి చెందిన శేఖర్​కు అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వారి వివాహానికి బాలిక వయస్సు, వారి కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోరని మనస్తాపానికి గురయ్యారు.

వారి ప్రేమ జీవితాంతం కొనసాగదనుకున్నారేమో కానీ.. రెండు రోజుల కిందట ఇంటి నుంచి బయటకు వచ్చారు. చిన్న చింతకుంట మండలంలోని ఉంద్యాల గ్రామం సమీపంలో ఉన్న కంది చేనులో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

శుక్రవారం మృతదేహాలను గుర్తించిన రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రేమజంట ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి:పెద్దలు పెళ్లికి నిరాకరించారని.. ప్రేమజంట ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details