మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసన్ పల్లికి చెందిన నర్సింలు గౌడ్ అచ్చన్నపేట నుంచి తన స్వగ్రామంకు ఆటోలో బయలుదేరారు. పేరూరు వద్దకు రాగానే చెరుకు లారీ వీరి ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.
ఆటోను ఢీకొట్టిన లారీ... భర్త మృతి, భార్య, పిల్లలకు గాయాలు - మెదక్ జిల్లా పేరూరులో ఆటోను ఢీకొట్టిన లారీ
ఆటోలో స్వగ్రామానికి వెళ్తున్న ఓ కుటుంబాన్ని లారీ ఢీ కొట్టింది. ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రిని కోల్పోయిన పిల్లలు రోడ్డుపై రోదిస్తున్న ఘటన స్థానికులను కలచివేసింది. ఈ ప్రమాదం మెదక్ జిల్లాలో జరిగింది.
ఆటోను ఢీకొట్టిన లారీ... భర్త మృతి, భార్య, పిల్లలకు గాయాలు
మృతుని భార్య నవనీత, కూతురు భార్గవి, కుమారుడు అఖిలేష్‌కు సైతం గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని.. లారీని సీజ్ చేసి మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు మెదక్ రూరల్ ఎస్సై కృష్ణారెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చూడండి :ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి