మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ముంబయి నుంచి చెన్నైకి ఇనుప చువ్వలను తీసుకెళ్తున్న లారీ కందూర్ వద్దకు రాగానే అదుపు తప్పింది. కర్ణాటకకు చెందిన డ్రైవర్ కొండప్ప(22) లారీ క్యాబిన్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. లారీలో ఉన్న మహేశప్ప, సచిన్ తీవ్రంగా గాయపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
మహబూబ్‌నగర్‌లో లారీ బోల్తా... డ్రైవర్ మృతి - lorry
మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కొండప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు.
మహబూబ్‌నగర్‌లో లారీ బోల్తా... డ్రైవర్ మృతి