పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి బస్టాప్ వద్ద కూలి పని కోసం వెళ్లేందుకు ఆటో కోసం కలవేని కనకయ్య నిరీక్షిస్తున్నారు. గోదావరిఖని వైపు వెళుతున్న లారీ ఒక్కసారిగా అతనిపైకి దూసుకొచ్చింది. ప్రమాదంలో కనకయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో పక్కనే ఉన్న మరో ఇద్దరు చాకచక్యంగా తప్పించుకున్నారు. లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దూసుకొచ్చిన లారీ.. వ్యక్తి మృతి.. - latest accidents in telangana
పని కోసం వెళ్తున్న వ్యక్తిని.. లారీ మృత్యు రూపంలో వచ్చి కబళించింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి బస్టాప్ వద్ద కూలి పని కోసం వెళ్లేందుకు ఆటో కోసం నిరీక్షిస్తున్న కలవేని కనకయ్యపైకి లారీ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో కనకయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
దూసుకొచ్చిన లారీ.. వ్యక్తి మృతి..