ఆంధ్రప్రదేశ్లో మద్యాన్ని విక్రయించేందుకు తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన ముండ్రు శివకృష్ణ(26), దారల గోపి(22) డ్రైవర్లుగా పనిచేస్తూ కూకట్‌పల్లి అడ్డగుట్ట సొసైటీలో నివసిస్తున్నారు. ఏపీలో మద్యం విక్రయించాలన్న ఉద్దేశంతో మహీంద్ర మొరాజో వాహనంలో మద్యాన్ని తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందటంతో అడ్డగుట్ట సొసైటీ రోడ్ నంబర్ 4లో వాహనాల తనిఖీ చేపట్టారు. కారులో మద్యం సీసాలు ఉండటంతో వారిని అరెస్టు చేసారు. వాహనాన్ని సీజ్ చేసి, మద్యం బాటిళ్లని స్వాధీనం చేసుకున్నారు.
ఏపీకి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్ - హైదరాబాద్ కేపీహెచ్బీ నుంచి అక్రమంగా మద్యం తరలింపు
ఆంధ్రప్రదేశ్లో విక్రయించేందుకు మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేశారు. మద్యం బాటిళ్లను, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఏపీకి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్