తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చిరుత దాడిలో ఆవు దూడ మృతి.. భయాందోళనలో ప్రజలు - దేవరకద్రలో ఆవు దూడపై చిరుత దాడి

ఇటీవల వరుస చిరుత దాడులు రైతులను హడలెత్తిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం బర్రె దూడపై జరిగిన దాడి మరవకముందే మరోసారి ఆవుదూడపై చిరుత పంజా విసిరింది. మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్రకు చెందిన ఓ రైతు ఆవు దూడను చంపేసింది.

leopard attack on Cow calf killed in  devarakadra
చిరుత దాడిలో ఆవు దూడ మృతి

By

Published : Jan 10, 2021, 8:05 PM IST

పొలంలో కట్టేసిన ఆవు దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర ప్రాంతవాసులు భయాందోళనకు గురవుతున్నారు. గత నెలలోనే సమీపంలోని మన్యంకొండ గుట్టల్లో చిరుత సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పట్టణానికి చెందిన రాంపండు అనే రైతు ఎప్పటిలాగే పొలం వద్ద ఆవును, ఏడాది వయసున్న దూడను కట్టేసి ఇంటికి వచ్చాడు.

ఉదయం పొలం దగ్గరకు వెళ్లగానే.. ఆవుదూడ వెనుకభాగంలో చిరుత దాడి చేయడంతో అవయవాలన్నీ బయటపడి మృతి చెందినట్లు గమనించాడు. దీంతో వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారిణి మోనిషా ఆవు దూడకు గాయాలైన తీరును పరిశీలించారు. చిరుత దాడిలోనే మృతి చెందినట్లు ఆమె ధ్రువీకరించారు. రైతు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

ఇదీ చూడండి :అపార్ట్​మెంట్ సెల్లార్​ నీటిలో శవం.. ఇంతకీ ఎవరిది?

ABOUT THE AUTHOR

...view details