వరంగల్ అర్బన్ జిల్లాలో నిషేధిత అంబర్ గుట్కా పాకెట్లు భారీ మొత్తంలో కార్యదళం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మట్టెవాడ పీఎస్ పరిధిలో ఓ కారులో తరలిస్తున్న 9 బ్యాగులను గుర్తించారు. వాటి విలువు దాదాపు రూ.4.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
భారీస్థాయిలో నిషేధిత గుట్కా పాకెట్లు స్వాధీనం - భారీస్థాయిలో నిషేధిత గుట్కా పాకెట్లు స్వాధీనం
వరంగల్ అర్బన్ జిల్లా మట్టెవాడ పీఎస్ పరిధిలో పెద్దమొత్తంలో నిషేధిత గుట్కా పాకెట్లను కార్యదళం పోలీసులు పట్టుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.4.50 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేశారు.
భారీస్థాయిలో నిషేధిత గుట్కా పాకెట్లు స్వాధీనం
మట్టెవాడ మర్రివెంకటయ్య కాలనీకి చెందిన శ్రీధర్ తన కారులో బీదర్ నుంచి అంబర్ గుట్కా పాకెట్లను ఇక్కడికి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లోని కిరాణ దుకాణాలకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు సీఐ నందిరామ్ నాయక్ వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కారును సీజ్ చేశారు. తదుపరి చర్యల కోసం గుట్కా పాకెట్లను ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించామని తెలిపారు.