రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గంధంగూడాలో క్రితికా రెడ్డి అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వికారాబాద్‌కు చెందిన రామకృష్ణారెడ్డితో 40 రోజుల క్రితం వివాహం జరిగింది. నగర శివారు గంధంగుడాలో దంపతులిద్దరు నివాసం ఉంటున్నారు.
మానసిక ఒత్తిడితో తనువు చలించిన నవవధువు - hanging
మానసిక ఒత్తిడితో ఓ నవవధువు తనువు చాలించిన ఘటన హైదరాబాద్ నగర శివారు గంధంగూడాలో జరిగింది. 40 రోజుల క్రితం వివాహం చేసుకున్న క్రితికా రెడ్డి బాత్ రూంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేపడుతున్నారు.
మృతురాలు
ఉరేసుకుని
మృతురాలి తండ్రి ఇటీవల అనారోగ్యంతో కోమాలోకి వెళ్లారు. తండ్రికి తోడుగా ఆసుపత్రిలో ఉన్న క్రితికా ఒత్తడికి గురై ఉరివేసుకున్నట్టు బంధువులు తెలిపారు. కొన్ని రోజులుగా మృతురాలు డిప్రెషన్ మందులు వాడుతున్నట్టు కుటుంబసభ్యులు చెప్పారు. భర్త ఉద్యోగానికి వెళ్లిన తరువాత స్నానాల గదిలో ఉరి వేసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్కున్నారు. ఇవీ చూడండి: 'సీజేఐపై ఆరోపణలు అసత్యం, కల్పితం'