తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన టీచర్​ అరెస్ట్​

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే, సభ్యసమాజం సిగ్గుపడేలా వ్యవహరించాడు. పరీక్షల్లో సహాయం చేస్తానంటూ పదో తరగతి విద్యార్థిని పై అత్యాచారాయత్నానికి ఒడిగట్టాడు. ఫలితంగా ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయాన్ని గోప్యంగా దాచిపెట్టిన సూర్యాపేట జిల్లా విద్యాధికారికి కలెక్టర్​ అమోయ్ కుమార్ షోకాజు నోటీసు పంపించారు.

By

Published : Mar 29, 2019, 4:57 PM IST

కీచక టీచర్​ అరెస్ట్​

కీచక టీచర్​ అరెస్ట్​
సూర్యాపేట మండలం పాండు నాయక్ తండా పాఠశాలకు చెందిన కటకం నరసింహ స్వామి ఇటీవల ప్రారంభమైన పదోతరగతి పరీక్షకు ఇన్విజిలేషన్ విధులు నిర్వహిస్తున్నాడు. తాను విధులు నిర్వహిస్తున్న కేంద్రంలో పరీక్ష రాస్తున్న ఓ బాలికకు సహాయం చేస్తానని నమ్మించి విద్యానగర్​లో ఉండే యూనియన్ కార్యాలయానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఎవరులేకపోవటంతో విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఎలాగో తప్పించుకున్న విద్యార్ధిని తన సంరక్షకురాలైన పెద్దమ్మకు చెప్పి బోరున విలపించటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు 100 నెంబర్​కు వచ్చిన బాధితుల ఫిర్యాదు జాబితా ఆధారంగా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకున్నారు. సదరు ఉపాధ్యాయున్ని సస్పెండ్ చేశారు. బాలికపై జరిగిన అత్యాచారయత్నం జరిగిన సమాచారాన్ని కలెక్టర్​కు అందించని కారణంగా డీఈవో మదన్ మోహన్​కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.

ఫిర్యాదు రాలేదని సాకులు చెప్పిన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఫిర్యాదుపై క్షణాల్లో వాలిపోయే పోలీసులు ఇంత పెద్ద నేరం జరిగినప్పటికీ కేసు నమోదు చేయడంలో జాప్యం చేశారన్న ఆరోపణలు వినపడుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details