నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు సత్ర్పవర్తనతో మెలగాలని కరీంనగర్ అదనపు డీసీపీ శ్రీనివాస్ అన్నారు. జిల్లాలోని హుజూరాబాద్‌లో గల ప్రతాప సాయిగార్డెన్‌లో నిర్వహించిన హిస్టరీ షీటర్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
'తప్పుడు మార్గాలను అనుసరించే వారిపై పోలీసుల నిఘా'
నేరప్రవృత్తి కలిగిన వ్యక్తులు చెడు మార్గాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని కరీంనగర్ అదనపు డీసీపీ శ్రీనివాస్ అన్నారు. తప్పుడు మార్గాలను అనుసరించే వారిపై పోలీసుల నిఘా ఉంటుందని హెచ్చరించారు.
జిల్లాలోని హుజూరాబాద్ సబ్ డివిజన్ పరిధిలో మెుత్తం 135 మందిపై రౌడీషీట్లను తెరిచినట్లు అదనపు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఇందులో సత్ర్పవర్తన కలిగిన 19మందిపై షీట్లను తొలగించామని పేర్కొన్నారు. నేరప్రవృత్తి కలిగిన వ్యక్తులు చెడు మార్గాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. తప్పుడు మార్గాలను అనుసరించే వారిపై పోలీసుల నిఘా ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐలు మాధవి, సృజన్‌రెడ్డి, కిరణ్, రాములు, ఎస్సైలు ప్రశాంత్‌రావు, రవి, కిరణ్‌రెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాస్‌రావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి:పాత కక్షలతో కాల్పులు: ఆదిలాబాద్ ఘటనలో వ్యక్తి మృతి