సైదాబాద్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు నిరుద్యోగులే లక్ష్యంగా మోసాలకు పాల్పడ్డాడు. భారత రక్షణ పరిశోధన సంస్థలో కొలువు ఇప్పిస్తానంటూ నలుగురి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు.
కొలువుల పేరుతో మోసం...నిందితుని అరెస్ట్ - రంగారెడ్డి జిల్లా తాజా వార్తలు
డబ్బులతో ఉద్యోగం పొందాలనుకోవడం నేటి యువత బలహీనత. అదే ఆసరాగా చేసుకుని మోసానికి తెరతీశాడు ఓ యువకుడు. భారత రక్షణ పరిశోధన సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షల రూపాయలు కాజేశాడు. బాధితుని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుని ఆటకట్టించారు.
కొలువుల పేరుతో మోసం...నిందితుని అరెస్ట్
బాధితుని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి చరవాణి, రెండు నకిలీ ఐడీ కార్డులు, 5,44,936 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి మొత్తం మోసాలపై దర్యాప్తు చేస్తున్నారు.