ప్రముఖ వ్యాపార వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్ వెలుగులోకి వచ్చింది. ముగ్గురు పోలీస్ అధికారులను నిందితులుగా పేర్కొంటూ... అభియోగపత్రంలో పొందుపరచటం ఈ కేసులో సంచలనంగా మారింది. హనీట్రాప్ ద్వారా జయరాంను రప్పించి, చిత్రహింసలు పెట్టి హత్య చేసిన రాకేశ్ రెడ్డి, ఆపై మృతదేహాన్ని తెలంగాణ సరిహద్దులు దాటించాడని 23 పేజీల ఛార్జిషీట్లో పేర్కొన్నారు. 12 మంది నిందితులను, 73 మంది సాక్షుల పేర్లను చేర్చారు.
జయరాం కేసు ఛార్జిషీట్లో ముగ్గురు పోలీసు అధికారుల పేర్లు - jayaram-case
చిగురుపాటి జయరాం హత్య కేసులో ఏప్రిల్ నెలలోనే ఛార్జిషీట్ దాఖలైంది. 23 పేజీలో అభియోగపత్రంలో 12 మంది నిందితులను, 73 మంది సాక్షుల పేర్లను చేర్చారు. అందులో కొందరు పోలీసు అధికారుల పేర్లూ ఉన్నాయి.
jayaram-case
ఈ కేసులో నిందితులుగా రాకేశ్ రెడ్డి, విశాల్, వాచ్మెన్ శ్రీనివాస్, రౌడీషీటర్ నగేశ్, నటుడు, కమెడియన్ సూర్యప్రసాద్, ఆయన స్నేహితుడు కిశోర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి సుభాష్ రెడ్డి, తెదేపా నేత బీఎన్ రెడ్డి, వ్యాపారి అంజిరెడ్డి, నల్లకుంట మాజీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, రాయదుర్గం మాజీ ఇన్స్పెక్టర్ రాంబాబు, ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ మల్లారెడ్డిలను పేర్కొన్నారు. జయరాం మేనకోడలు శిఖా చౌదరిని 11వ సాక్షిగా చేర్చారు.
ఇదీ చూడండి: వాళ్లు చెప్పితే చేసేస్తారా: ఉత్తమ్
Last Updated : Jun 10, 2019, 5:21 PM IST