తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అసలేం జరిగిందో.. మహేష్​ హత్యకేసులో వీడని చిక్కుముడి! - విజయవాడ గన్ ఫైర్ కేసు తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలో సంచలనం సృష్టించిన పోలీసు కమిషనరేట్ ఉద్యోగి మహేష్​ను ఎవరు? ఎందుకు? హత్య చేశారనే విషయంపై పోలీసులు ఇంకా నిర్ధారణకు రాలేదు. మహేష్​కున్న కాంటాక్ట్​లకు ఎలాంటి సంబంధం లేకపోవడం వల్ల నిందితుల గుర్తింపు సంక్లిష్టంగా మారింది.

investigation on mahesh murder case
ఏపీ: మహేష్​ హత్యకేసులో ఇంకా వీడని చిక్కుముడి!

By

Published : Oct 20, 2020, 3:16 PM IST

ఈనెల 10వ తేదీ ఆంధ్రప్రదేశ్​లోని నున్న బైపాస్​లో గజకంటి మహేష్ అనే వ్యక్తిని దుండగులు తుపాకితో కాల్చి హత్య చేశారు. సంఘటన జరిగి పది రోజులు గడుస్తున్నా .. ఎన్నో ప్రశ్నలు అధికారులను వేధిస్తున్నాయి. నిందితులుగా భావిస్తున్న అనుమానితుల పాదముద్రలు, ఘటన స్థలంలో గుర్తించిన వాటితో పోల్చి చూస్తున్నట్టు తెలిసింది.

ముస్తాబాద్ వెళ్లే రోడ్డులో కారుని వదిలినప్పుడు అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల్లో నిందితుల చిత్రాలు స్పష్టంగా లేవు. ఇందువల్ల ఆ పోలికలతో ఉన్నవారిని ఇతర సీసీ కెమెరాల్లో ఎక్కడైనా ఆధారాలు లభిస్తాయని పోలీసులు పరిశీలించారు. అయితే రామవరప్పాడు సెంటర్​లో ఎలాంటి ఆధారాలు లభించలేదు. హత్య జరిగిన విధానానికి, అతని జీవనశైలికి , అతని కాంటాక్ట్​లకు ఎలాంటి సంబంధం లేకపోవడంతో నిందితుల గుర్తింపు సంక్లిష్టంగా మారిందని పోలీసులు చెబుతున్నారు.

అయితే అసలు హత్యకు వాడిన తుపాకి ఎక్కడిది? ఈ తరహా నేరాలు ఎక్కడైనా జరిగాయా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన సమయంలో ఉన్న ఇద్దరు సాక్షులను ..నిందితులను గుర్తించేందుకు పోలీసులు తమతో పాటే తీసుకెళ్తున్నారు. దీనిపై విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులను వివరణ అడగ్గా.. మహేష్ హత్య కేసులో 50 శాతం దర్యాప్తు పూర్తయ్యిందని, మరో రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:మణుగూరు మావోయిస్టు దళసభ్యుల మృతదేహాలు అప్పగింత

ABOUT THE AUTHOR

...view details