మణప్పురం గోల్డ్‌లోన్ సంస్థలో చోరీకి విఫలయత్నం చేసిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 26న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ ఉన్న కార్యాలయంలో దొంగతనం చేసేందుకు కొందరు దుండగులు యత్నించారు. తెల్లవారుజామున సంస్థలో అలారం మోగడంతో దుండగులు పారిపోయారు. ఈ విషయాన్ని సంస్థ మేనేజర్ 100కు డయల్ చేసి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చోరీకి యత్నించిన కేసులో అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ - చోరీకి యత్నించిన అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
మహబూబ్‌నగర్‌లో చోరీకి యత్నంచిన కేసులో ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతనెల 26న మణప్పురం గోల్డ్‌లోన్ సంస్థలో దొంగతనానికి విఫలయత్నం చేశారు. అలారం మోగడంతో దుండగులు పరారయ్యారు.
కార్యాలయ ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించినట్లు డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. ఝార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అంతరాష్ట్ర ముఠా సభ్యులు, వారికి వసతి కల్పించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో సంస్థలో 47 కిలోల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదు ఉన్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి సకాలంలో చేరుకోవడం వల్ల భారీ దొంగతనానికి అడ్డుకట్ట పడిందన్నారు. ఈ ఘటనలో ఝార్ఖండ్‌కు చెందిన మరో నలుగురు నిందితులు ఉన్నట్లు తెలిపారు. వారికోసం ప్రత్యేక బృందాలను ఝార్ఖండ్ రాష్ట్రానికి పంపినట్లు డీఎస్పీ వెల్లడించారు.