మాన్వి అనే ఇంటర్ విద్యార్థిని తల్లిదండ్రులతో సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్‌ప్లలిలోని వైశ్య బ్యాంక్ కాలనీలో నివాసముంటుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న మాన్ని శుక్ర నుంచి కనిపించడం లేదు. బంధు మిత్రులు, స్నేహితులను ఆరా తీసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.
బోయిన్‌పల్లి పీఎస్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం - bowenpally latest news
ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వచ్చిన అనంతరం మొదటి సంవత్సరం విద్యార్థిని అదృశ్యమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
బోయిన్‌పల్లి పీఎస్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మాన్వి ఎటు వెళ్లింది అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వచ్చాక విద్యార్థిని అదృశ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తుంది.
ఇదీ చూడండి:కుటుంబ కలహాలతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త