మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన పద్మిని, శ్రీనివాస్‌కు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు డిగ్రీ చదువుతున్నాడు. రెండో కుమారుడు సందీప్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఫలితాల్లో రెండు మార్కులతో సందీప్ (19) ఫెయిలయ్యాడు. మనస్థాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఉరివేసుకొని ఇంటర్ విద్యార్థి బలవన్మరణం - ఇంటర్ విద్యార్థి సందీప్ ఆత్మహత్య
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్‌లో సందీప్ అనే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్లో ఫెయిలైనందుకు మనస్థాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉరివేసుకొని ఇంటర్ విద్యార్థి బలవణ్మరణం