ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామం సమీపంలో బొలెరో వాహనాల ద్వారా రేషన్ బియ్యాన్ని తరలించి లారీలో లోడ్ చేస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. ఖమ్మం టాస్క్‌ఫోర్స్ , తల్లాడ పోలీసు సిబ్బంది ఆ గ్రామానికి చేరుకున్నారు. లారీలో లోడింగ్ చేసిన 100 క్వింటాళ్ల రేషన్ బియ్యo, లారీ, బోలెరో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
కుర్నవల్లిలో 100 క్వింటాళ్ల అక్రమ రేషన్‌బియ్యం స్వాధీనం - ఖమ్మం జిల్లా నేర వార్తలు
ఖమ్మం జిల్లా కుర్నవల్లి నుంచి లారీలో అక్రమంగా తరలిస్తున్న100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఒక లారీ, బొలేరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కుర్నవల్లిలో 100 క్వింటాళ్ల అక్రమ రేషన్‌బియ్యం స్వాధీనం
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించడం జరుగుతుందని పోలీసులకు తెలిపారు. ఈ సోదాల్లో టాస్క్ ఫోర్స్ పై, వైరా సీఐ వసంత్ కుమార్, తల్లాడ ఎస్సై తిరుపతి రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి:పిచ్చికుక్క స్వైరవిహారం.. కొట్టి చంపిన స్థానికులు