తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఇద్దరు దొంగల అరెస్టు... అందులో ఒకరిపై 64 కేసులు! - telangana varthalu

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు కరుడుగట్టిన ఘరానా దొంగలను వేర్వేరు కేసుల్లో హైదరాబాద్​ పోలీసులు అరెస్టు చేశారు. ఓ నిందితుడిపై 64 కేసులు నమోదయ్యాయని... మరో దొంగకు మూడు కేసుల్లో ప్రమేయం ఉందని హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ వెల్లడించారు.

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులు అరెస్ట్​
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులు అరెస్ట్​

By

Published : Jan 13, 2021, 3:10 PM IST

ఇద్దరు నిందితులను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వేర్వేరుగా చోరీలకు పాల్పడే ఈ ఇద్దరు నిందితుల్లో షేక్‌ అబ్దుల్‌ జాఫర్‌పై హైదరాబాద్‌ పరిధిలోనే 64 కేసులు నమోదయ్యాయని హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. అతడిపై వరంగల్‌లోనూ రెండు కేసులు ఉన్నాయన్నారు. టోలీచౌకీలో నివాసం ఉండే అబ్దుల్‌.. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని సీపీ తెలిపారు. అలాంటి వారికి ఆటోలు ఇవ్వకూడదని.. వాళ్ల నేర చరిత్రను హాక్‌ ఐలో తెలుసుకోవాలని సూచించారు.

నిందితుడి నుంచి 12 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరో దొంగను అరెస్ట్‌ చేసిన పోలీసులు... అతడి నుంచి పదిన్నర లక్షల రూపాయల విలువైన సొత్తును జప్తు చేశారు. హబీబ్‌ అజ్మద్‌ అనే నిందితుడికి మూడు కేసుల్లో ప్రమేయం ఉందని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు.

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులు అరెస్ట్​

ఇదీ చదవండి: వెంచర్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

ABOUT THE AUTHOR

...view details