తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అన్న వచ్చాడని తీసుకెళ్లాడు... భార్యని కొట్టి చంపాడు! - తెలంగాణ వార్తలు

కట్టుకున్నవాడే పట్ల కాలయముడయ్యాడు. వివాహేతర సంబంధానికి భార్య అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. పక్కా ప్లాన్‌ రచించాడు. ఆమె అన్న వచ్చాడని నమ్మించి... కూలీ పనికి వెళ్లిన శాంతమ్మని తీసుకొచ్చి మరీ ఊపిరి తీశాడు.

husband-murdered-a-wife-due-to-his-illegal-relations-in-nagarkurnool
అన్న వచ్చాడని తీసుకెళ్లాడు... భార్యని కొట్టి చంపాడు!

By

Published : Dec 20, 2020, 6:49 PM IST

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని... మూడు ముళ్లు వేసిన వాడే అతి కిరాతకంగా హతమార్చాడు. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం జాజాల గ్రామానికి చెందిన కృష్ణయ్య, శాంతమ్మలకు 20 ఏళ్ల క్రితం వివాహం అయింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కృష్ణయ్యకు అదే గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం భార్యకు తెలిసి తరుచుగా గొడవలు జరుగుతుండేవి.

వివాహేతర సంబంధం విషయమై పెద్దల సమక్షంలో సర్ది చెప్పినా అతనిలో మార్పు రాలేదు. భార్య శాంతమ్మ అడ్డు తొలగించుకునేందుకు పథకం రచించాడు. కూలీ పనికి వెళ్లిన శాంతమ్మను తన సోదరుడు వచ్చాడని చెప్పి... పొలం దగ్గరికి శనివారం సాయంత్రం తీసుకెళ్లాడు. అలా నమ్మించి తీసుకెళ్లి... పెద్ద కర్రతో తలపై కొట్టాడు.

శాంతమ్మ అక్కడికక్కడే మృతి చెందిందని కల్వకుర్తి సీఐ సైదులు తెలిపారు. ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:కన్నవాళ్లను ఒప్పించలేక.. కలిసి బతకలేక

ABOUT THE AUTHOR

...view details