అనుమానంతో భార్యను భర్త కర్రతో కొట్టి హత్య చేసిన దారుణ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గాంధారి మండల కేంద్రంలో నివాసముంటున్న ఉప్పు హనుమంతుకు భార్య సాయి రాణి(25), మూడేళ్ల పాప, 7 నెలల బాబు ఉన్నారు. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పిల్లపాపలతో చాలా సంతోషంగా జీవిస్తున్న కుటుంబంలో భర్తకు ఒక్కసారిగా అనుమానం అనే పుండు పుట్టి శనివారం సాయంత్రం భార్యను వ్యవసాయ క్షేత్రం వద్దకు తీసుకెళ్లి కర్రతో తీవ్రంగా తలపై గాయపర్చాడు.
ప్రాణం తీసిన అనుమానం... భార్యను కర్రతో కొట్టి చంపిన భర్త - కామారెడ్డి జిల్లా వార్తలు
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను హత్య చేసి తన ఇద్దరు చిన్నారులను తల్లి లేని బిడ్డలను చేశాడు. తల్లి మరణం, తండ్రి జైలు పాలు కావడం వల్ల పిల్లలు అనాథలయ్యారు.
ప్రాణం తీసిన అనుమానం... భార్యను కర్రతో కొట్టి చంపిన భర్త
శనివారం రాత్రి బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా... ఈరోజు ఉదయం సాయిరాణి మృతి చెందింది. తల్లి మరణం, తండ్రి జైలు పాలు కావడం వల్ల పిల్లలు అనాథలు అయ్యారు. అతని మనసులో పుట్టిన అనుమానం అనే పుండు చివరికి అతన్నే నాశనం చేసింది. కొందరు క్షణికావేశాలకు లోనై తొందర పాటు నిర్ణయాలతో అందమైన జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసుకుంటున్నారు.
ఇవీ చూడండి:యాదగిరిగుట్టలో గుర్తు తెలియని వ్యక్తి మృతి.. కేసు నమోదు