కుటుంబ కలహాలతో భార్యను భర్త హతమార్చాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన కిషన్, మార్తా భార్యభర్తలు. వీరికి 2009లో వివాహం జరిగింది. వృత్తిరీత్యా గత కొంతకాలంగా జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్పలో తన ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు.
కుటుంబ కలహాలతో భార్యను హతమార్చిన భర్త - హైదరాబాద్ నేరవార్తలు
మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యను హతమార్చాడో భర్త. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టారు.
కుటుంబ కలహాలతో భార్యను హతమార్చిన భార్త
భర్త కిషన్ ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తూ.. జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి కుటుంబకలహాలతో భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. దీనితో ఉదయం భార్యను కత్తితో పొడిచి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.