భార్యపై కత్తితో దాడి చేసి, గాయపరచిన ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. హైదరాబాద్ నాంపల్లికి చెందిన వెంకటేష్, శంకర్ పల్లి మండలం అంతప్పగూడకు చెందిన సుజాత నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన రెండేళ్లకే మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. భార్యభర్తలిద్దరు వేర్వేరుగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు.
భార్యపై కత్తితో దాడి చేసిన భర్త - వికారాబాద్ న్యూస్
వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మనస్పర్ధలతో రెండేళ్లకే విడిపోయారు. ఇంతలోనే వేరువేరుగా జీవనం సాగిస్తున్న భార్యపై భర్త దాడి చేశాడు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది.
భార్యపై కత్తితో దాడి చేసిన భర్త
ఇంతలోనే భర్తపై ఆమె వికారాబాద్ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ మాట్లాడుదామని ఆమె పని చేస్తున్న లేడిస్ కార్నర్ దగ్గరికి వచ్చి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన సుజాతను మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.