ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం దగ్దం ఘటనపై అంతర్వేదిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనాస్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన మంత్రులపై హిందూ సంస్థలు మండిపడ్డాయి. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... మంత్రులను నిలదీశారు. ఈ క్రమంలో పోలీసులు, వీహెచ్‌పీ, భజరంగదళ్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. బారికేడ్లను తోసుకుంటూ ఆందోళనకారులు తమ నిరసనను వ్యక్తం చేశారు. రథం దగ్ధం వెనక కుట్ర ఉందని ఆరోపించారు.
అంతర్వేదిలో ఉద్రిక్త వాతావరణం... దర్యాప్తు వేగవంతం - Hindu Organisation Angry on ministers in antharwedi
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధంపై హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంతర్వేది వచ్చిన మంత్రులను వీహెచ్‌పీ, భజరంగదళ్ సంస్థలు నిలదీశాయి.
రథం దగ్ధం ఘటనపై దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోందని.. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని డీజీపీని ఆదేశించినట్లు తెలిపారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఘటనాప్రాంతాన్ని పరిశీలించారు. వచ్చే కల్యాణోత్సవం నాటికి నూతన రథం తయారు చేయిస్తామని హామీ ఇచ్చారు. ముగ్గురు మంత్రులు కలిసి దీనిపై సీఎం జగన్కు నివేదిక అందించనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:సేంద్రీయ సేద్యంపై.. సర్కారు ప్రత్యేక దృష్టి!