ETV Bharat / jagte-raho
బీర్ బాటిల్‌తో కొట్టి హత్య చేసిన భార్య
తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేయించింది ఓ భార్య. ఈ దారుణం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో చోటు చేసుకుంది.
నిందితులను పట్టుకున్న పోలీసులు
By
Published : Mar 17, 2019, 6:12 AM IST
| Updated : Mar 17, 2019, 7:58 AM IST
నిందితులను పట్టుకున్న పోలీసులు అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్య తన భర్తను హత్య చేసిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్‌లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న నరసింహ అనే వ్యక్తి ఈ నెల 3న హత్యకు గురయ్యాడు. అతని మృతదేహాన్ని ఈ నెల 7న పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహించగా నిందితులు పట్టుబడ్డారు. గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్న లక్ష్మి.. తన ప్రియుడు శేఖర్‌తో కలిసి జడ్చర్లలోని జాతీయ రహదారి పక్కన భర్తను హత్య చేసింది. భర్తకు మద్యం తాగించి బీరు బాటిల్‌తో తలపై కొట్టి చంపినట్లు డీఎస్పీ తెలిపారు. శనివారం ఉదయం హైదరాబాద్‌కు ప్రియుడితో కలిసి పారిపోతుండగా జడ్చర్ల సీఐ బాలరాజు, సిబ్బంది వారిని పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. Last Updated : Mar 17, 2019, 7:58 AM IST