నారాయణపేట జిల్లా మరికల్ పోలీస్స్టేషన్ పరిధిలోని మద్వార్ గ్రామంలో టాస్క్ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారంతో దాడులు చేసి, లక్ష రూపాయల విలువ చేసే నిషేధిత గుట్కా పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా పాకెట్లు స్వాధీనం - నారాయణపేట జిల్లా నేర వాార్తలు
నారాయణపేట జిల్లాలో జరిగిన టాస్క్ఫోర్స్ దాడుల్లో లక్ష రూపాయల విలువ చేసే నిషేధిత గుట్కా పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించిన పోలీసులు రవిశెట్టి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా పాకెట్లు స్వాధీనం
మద్వార్ గ్రామంలో హనుమాన్ కిరాణ దుకాణం నిర్వహిస్తున్న రవిశెట్టి అనే వ్యక్తిని పట్టుకుని స్థానిక పోలీస్స్టేషన్లో అప్పగించారు. అతనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.