తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ప్రేమించిన వాడే కడతేర్చాడు..రెండేళ్ల తర్వాత నిందితుడు అరెస్ట్​ - గుంటూరు నజీమా కేసు

ఏపీలోని గుంటూరు జిల్లా అలీనగర్​లో రెండున్నరేళ్ల కిందట అదృశ్యమైన బీటెక్ విద్యార్థిని నజీమా కేసును పోలీసులు ఛేదించారు. పెళ్లి ప్రస్తావన తెవటంతో ప్రేమించిన వాడే దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించామని వెల్లడించారు.

ప్రేమించిన వాడే కడతేర్చాడు..రెండేళ్ల తర్వాత నిందితుడు అరెస్ట్​
ప్రేమించిన వాడే కడతేర్చాడు..రెండేళ్ల తర్వాత నిందితుడు అరెస్ట్​

By

Published : Nov 10, 2020, 10:54 PM IST

ప్రేమోన్మోదానికి మరో యువతి బలైంది. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా అలీనగర్​లో రెండున్నరేళ్ల కిందట అదృశ్యమైన బీటెక్ విద్యార్థిని నజీమా కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడు షేక్ కరీం అలియాస్ నాగూర్ యువతిని దారుణంగా హత్యచేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పెళ్లి ప్రస్తావన తీసుకురావడం వల్లే యువతిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

"నజీమా నిందితుడు షేక్ కరీం ప్రేమించుకున్నారు. నజీమా పెళ్లి ప్రస్తావన తీసుకురావంటంతో ఆమెను అడ్డుతొలగించుకోవాలని భావించాడు. ప్రణాళిక ప్రకారం వారిద్దరూ కలుసుకునే గదికి ఆమెను రప్పించి ఏకాంతంగా గడిపారు. ఆమె మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురావటంతో కోపోద్రిక్తుడై...ఆమె తలను గోడకేసి బాదాడు. తలకు గాయమై సృహ తప్పి పడిపోయిన ఆమెను గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం ముందుగా తెచ్చి పెట్టుకున్న కట్టర్​తో శరీరాన్ని ముక్కులుగా కట్​చేసి ప్లాస్టిక్ కవర్​లో మూటగట్టి నిర్జన ప్రదేశంలో పడేశాడు. రెండురోజుల తర్వాత మళ్లీ వెళ్లి పెట్రోల్ పోసి శరీరాన్ని తగులబెట్టాడు. అనుమానిత శవం దొరికిందన్న సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శరీర అవయవాలను డీఎన్​ఏ పరీక్షకు పంపగా...మృతదేహం కనిపించకుండా పోయిన నజీమాదిగా గుర్తించాం. ఈ కేసులో ముద్దాయిని రెండేళ్ల తర్వాత అరెస్టు చేశాం" -అమ్మిరెడ్డి, గుంటూరు అర్బన్ ఎస్పీ

నిందితుడిని రెండేళ్ల తర్వాత అరెస్టు చేశామని ఎస్పీ అమ్మిరెడ్డి స్పష్టం చేశారు. అతని వద్ద నుంచి కట్టర్, నజీమా ఆధార్ కార్డు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని రిమాండ్​కు తరలించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:డోర్నకల్​లో అంతర్​రాష్ట్ర పేకాట రాయుళ్లు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details