నల్లగొండ జిల్లా పెద్ద ఆడిషర్లపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన తాత మనవడు వ్యవసాయ బావిలో మృత్యువాత పడ్డారు. కర్రయ్య పశువులు మేపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజు లాగే పశువులను మేపడానికి బయలుదేరే సమయానికి తన మనవడు సాయి ఈత నేర్పించమని అడగడం వల్ల వెంట తీసుకెళ్లాడు.
పశువులను వ్యవసాయ పొలంలో వదిలి పక్కనే ఉన్న బావిలో మనవడికి ఈత నేర్పడానికి తీసుకెళ్లాడు. ప్రమాదవశాత్తు సాయి మునగడం చూసిన కర్రయ్య కాపాడ్డానికి ప్రయత్నించగా ఇద్దరు మృతిచెందారు. తన వెంట తెచ్చుకున్న టిఫిన్ బాక్స్, చెప్పులు, బట్టలను చూసిన స్థానికులు బావి వద్దకు వచ్చి చూడగా ఇద్దరూ శవాలై కనిపించారు. తాతా మనవళ్ల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
'ఈత కోసం బావిలో దిగిన తాతా మనవళ్ల మృతి' - KARRAIAH GRAND PA
కర్రయ్య అనే వృద్ధుడు పశువులను మేతకు తీసుకెళ్తుండగా తన మనవడు సాయి ఈత నేర్పించమని అడిగాడు. మనవడికి ఈత నేర్పుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు సాయి. అతన్ని కాపాడే ప్రయత్నంలో తాత కూడా మృతిచెందిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది.
ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి తాత మనవడి మృతి
ఇవీ చూడండి : కరెంటు షాక్తో కార్మికుడు మృతి