రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంట సామూహిక హత్య కేసు విచారణ మంగళవారం వరంగల్ కోర్టులో జరిగింది. కరోనా వ్యాప్తి వల్ల మార్చి 17న మూతబడిన న్యాయస్థానాలు తిరిగి ఇటీవలే ప్రారంభం కాగా.. సామూహిక హత్యల కేసు విచారణే తొలి కేసు కావడం గమనార్హం.
కోర్టులో గొర్రెకుంట సామూహిక హత్యల కేసు విచారణ - వరంగల్ కోర్టులో గొర్రెకుంట హత్య కేసు నిందితుడు
వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంటలో తొమ్మిది మందిని హత్య చేసిన నిందితుడు సంజయ్‌కుమార్‌ను పోలీసులు ఓరుగల్లు జిల్లా కోర్టులో హాజరుపర్చారు. తదుపరి విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది
కోర్టులో గొర్రెకుంట సామూహిక హత్యల కేసు విచారణ
ఒకరి తర్వాత ఒకరిని.. వరుసగా తొమ్మిది మందిని పడేసి జలసమాధి చేశాడనే ఆరోపణలపై అరెస్టయి వరంగల్ జైల్లో ఉంటున్న బిహార్ రాష్ట్రానికి చెందిన సంజయ్‌కుమార్‌ను గీసుగొండ పోలీసులు కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. దీనికి సంబంధించిన సాక్ష్యులు కూడా వచ్చారు. న్యాయవాది ప్రశ్నలు వేయగా ఆ విషయాలను కోర్టు నమోదు చేసుకుంది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.