వీధి కుక్కల దాడిలో గుగులోతు మోహన్ అనే రైతుకు చెందిన 6 మేకలు చనిపోగా మరో 20 మేకలు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలంలోని రందాన్ తండాలో జరిగింది.
వీధి కుక్కల దాడిలో మేకలు మృతి - వరంగల్ గ్రామీన జిల్లా వార్తలు
గ్రామ సింహాలు రెచ్చిపోతున్నాయి. మూగ జీవాలతో పాటు మనుషులను గాయపరుస్తున్నాయి. తాజాగా వరంగల్ గ్రామీణ జిల్లాలో ఓ రైతుకు చెందిన 6 మేకలను చంపి, సుమారుగా మరో 20 మేకలను గాయపరిచాయి.
వీధి కుక్కల దాడిలో మేకలు మృతి
జీవనోపాధిగా పెంచుకుంటోన్న మూగజీవాలు వీధికుక్కల దాడిలో మరణించడంతో ఆ రైతు కన్నీరుమున్నీరుగా విలపించాడు. అధికారులు స్పందించి తనను ఆదుకోవాలని వేడుకొంటున్నాడు.