తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి మౌన పోరాటం - warangal rural news

అన్ని తానై చూసుకుంటానని నమ్మపలికాడు. నీవు లేక నేను లేనని అన్నాడు. నిన్ను బంగారంలా చూసుకుంటానని ముద్దు ముద్దు ముచ్చట్లు చెప్పాడు. నీతోనే చావైనా బతుకైనా అని సినిమా డైలాగులు సైతం చెప్పి ఓ అభాగ్యురాలిని సంతోష్ అనే యువకుడు వలలో వేసుకున్నాడు. 10 ఏండ్లు కలిసి సహజీవనం చేసి పెళ్లి పేరెత్తగానే మొహం చాటేశాడు. దీంతో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం లోహిత గ్రామంలో చోటుచేసుకుంది.

Girlfriend's silent fight in front of boyfriend's house
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి మౌన పోరాటం

By

Published : Jan 12, 2021, 9:43 AM IST

ప్రేమ పేరుతో వంచించిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌన పోరాటానికి దిగిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం లోహిత గ్రామంలో చోటుచేసుకుంది. అన్ని తానై చూసుకుంటానని నమ్మపలికిన సంతోష్​ అదే గ్రామానికి చెందిన ఓ యువతితో 10 ఏండ్లు కలిసి సహజీవనం చేశాడు. పెళ్లి పేరెత్తగానే మొహం చాటేశాడు. దీంతో దిక్కు తోచని ఆ ప్రియురాలు ప్రియుడి ఇంటిముందు బైఠాయించి న్యాయపోరాటానికి దిగింది.

సంతోష్ తో పెళ్లి చేయకపోతే చనిపోతానని... క్రీమీ సంహారక మందుతో బోరున విలపిస్తూ కన్నీటి పర్యంతం అయ్యింది ఆ అభాగ్యురాలు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా... పెళ్లి జరిపించేవరకు కదిలేది లేదని విలపించింది.

ఇదీ చదవండి:ఈత సరదాకు.. బాలుడు బలి

ABOUT THE AUTHOR

...view details