కిరాణ దుకాణానికి వెళ్లిన బాలిక అదృశ్యమైన ఘటన... సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్‌లో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన బాబూలాల్ సింగ్ అనే వ్యక్తి 12 ఏళ్లక్రితం వచ్చి ఇస్నాపూర్‌లో నివసిస్తూ... స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు.
కిరాణ దుకాణానికి వెళ్లిన బాలిక అదృశ్యం - బాలిక అదృశ్యం
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో కిరాణ దుకాణానికి వెళ్లిన బాలిక అదృశ్యమైంది. తండ్రి ఫిర్యాదుతో పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కిరాణ దుకాణానికి వెళ్లిన బాలిక అదృశ్యం
బాబూలాల్ సింగ్ కూతురు ఉషాకుమారి... ఈ నెల 19న సాయంత్రం కిరాణ దుకాణానికి వెళ్లింది. కానీ వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడం వల్ల పటాన్చెరు పోలీస్ స్టేషన్లో తండ్రి ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.