తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

హైదరాబాద్‌ మీదుగా తరలిస్తోన్న గంజాయి పట్టివేత - latest crimes in hyderabad

గంజాయిని విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ మీదుగా ముంబయికి తరలిస్తుండగా పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. వారి నుంచి 26 కిలోల గంజాయితో పాటు రెండు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.

ganja-sellers-arrested-by-taskforce-police
హైదరాబాద్‌ మీదుగా తరలిస్తోన్న గంజాయి పట్టివేత

By

Published : Dec 25, 2020, 9:41 PM IST

మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 26 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీ మోయిన్‌బాగ్‌కు చెందిన సయ్యద్‌ గౌస్‌, నియాజుద్దీన్‌ విశాఖపట్నం నుంచి గంజాయిని హైదరాబాద్‌ మీదుగా ముంబయికి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

వారి నుంచి గంజాయితో పాటు రెండు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నంలో కొనుగోలు చేసి ముంబయిలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇదీ చూడండి: వృద్ధురాలిని హత్య చేసి అదే ఇంట్లో పూడ్చి పెట్టారు!

ABOUT THE AUTHOR

...view details