పొట్టకూటి కోసం పనికి వెళ్తే.. మృత్యువు కబళించేసింది. వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. అసలు ఏం జరిగిందంటే..?
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన మాధవ్... తాను కొత్తగా కట్టుకున్న ఇంటికి రంగులు వేయడం కోసం, ఫర్నిచర్ పని చేయించడం కోసం.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలానికి చెందిన నలుగురిని కారులో గురువారం రాత్రి తీసుకెళ్లాడు. అదే వారి జీవితాలకు చివరి ప్రయాణం అవుతుందని తెలుసుకోలేకపోయారు.
ప్రకాశం జిల్లా పామూరుకు వెళ్తున్న కారు... రొంపిచర్ల మండలం సుబ్బాయపాలెం వద్దకు చేరుకోగానే అదుపుతప్పి కాల్వలోకి బోల్తాకొట్టింది. పనికోసం వెళ్లిన నలుగురు వ్యక్తులు నీట మునిగి మృత్యువాత పడ్డారు. ప్రకాశం జిల్లాకు చెందిన మాధవ్‌కు మాత్రం తీవ్రగాయాలతో బయటపడ్డాడు.