మీ స్వంచ్ఛంద సంస్థ అందిస్తున్న సేవ మాకు ఎంతగానో నచ్చింది... మీ సంస్థ చిరునామా, బ్యాంకు ఖాతా వివరాలు పంపిస్తే విరాళం ఇస్తామంటూ వచ్చే ఫోన్లకు స్పందించారంటే.. అంతే. అమాయకులకు ఎరవేసి నట్టేట ముంచుతున్నారు ఆఫ్రికన్లు. ఉపాధి లేని కారణంగా నైజీరియా, సోమాలియా, కెన్యా, ఉగాండా, ఇథియోఫియాకు చెందినవారు సైబర్ నేరాలనే వృత్తిగా ఎంచుకున్నారు. అక్కడ ఉండే మోసాలకు పాల్పడుతున్న వాళ్లు కొంత మందైతే... విద్య, పర్యాటకం, వ్యాపారం, వైద్య చికిత్స కోసం వీసాలపై వచ్చి మరికొంత మంది మోసాలకు తెగబడుతున్నారు. స్థానికుల సాయంతో సైబర్ మోసాలు చేస్తున్నారు. కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, చరవాణిలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని... గుర్తు తెలియని వ్యక్తులు పంపే లింకులు చూడొద్దని సైబర్ క్రైం పోలీసులు, నిపుణులు సూచిస్తున్నారు.
కంపెనీ మెయిల్స్ హ్యాక్
ఇతర దేశాల్లో ఉంటూ సైబర్ మోసాలకు పాల్పడే వాళ్లు ఎక్కువగా పెద్ద పెద్ద కంపెనీలకు చెందిన మెయిళ్లను హ్యాక్ చేస్తున్నారు. కంపెనీ మెయిల్‌కు మాల్వేర్ పంపించి... మొదట మెయిల్ హ్యాక్ చేస్తారు. ఆ తర్వాత ఆ మెయిల్లో ఉండే... ఇతర కంపెనీల వివరాలన్నీ సేకరిస్తారు. ఉదాహరణకు ఒక కంపెనీ... ఇంకో కంపెనీకి డబ్బులు చెల్లించాల్సి ఉంటే వాటి వివరాలు సేకరిస్తారు. డబ్బులు తీసుకోవాల్సిన కంపెనీ ఈ మెయిల్ ఖాతాలో ఒక మార్పు చేసి... డబ్బు చెల్లించాల్సిన కంపెనీకి సందేశం పంపుతారు. ఇవేమీ గమనించని కంపెనీ ప్రతినిధులు... చెల్లించాల్సిన డబ్బులను సైబర్ నేరగాళ్లు పంపిన ఖాతాలో జమ చేస్తారు. ఒకవేళ మెయిల్ ఖాతా, బ్యాంకు వివరాలు మారిన సంగతిని గుర్తించి అవతలి వ్యక్తిని అడిగినా... ఆ ఖాతాలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిఘా పెట్టినందుకు ఈ ఖాతాలోనే జమ చేయాలని సైబర్ నేరగాళ్లు నమ్మిస్తున్నారు. ఇలా ఎక్కువగా ఇతర దేశాల్లోని సైబర్ నేరగాళ్లు కంపెనీల మెయిళ్లను హ్యాక్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు.
స్థానికుల సాయం..