యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పరిధిలోని మాసుకుంట గుట్టపై అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదావశాత్తు చెట్లకు నిప్పు అంటుకొని పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు సహాయ చర్యలు చేపట్టారు.
చెట్లకు నిప్పంటుకొని గుట్ట దగ్ధం.. - మాసుకుంట గుట్టపై అగ్నిప్రమాదం
ప్రమాదావశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి గుట్టలు తగలబడిన ఘటన... యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
చెట్లకు నిప్పంటుకొని గుట్ట దగ్ధం.. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు
పక్కనే రెండు పెద్ద టపాకాయల హోల్సేల్ దుకాణాలు ఉన్నప్పటికీ... అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. మూడేళ్లుగా ఎవరో టపాకాయ దుకాణాల వద్ద కావాలనే మంటలు పెడుతున్నట్టు యజమానులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి :ఆస్తుల నమోదు సమయంలో ఆధార్ అడగొచ్చు: ప్రభుత్వం