నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలోని రైస్ మిల్లులో మంటలు చెలరేగాయి. విద్యుదాఘాతంతో మంటలు వ్యాపించడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలు అదుపు చేశారు. రైస్ మిల్లు వద్ద నిల్వచేసిన 50 వేల గన్ని బస్తాలు దగ్ధమయ్యాయని ఎస్సై రవి తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు.
రైస్ మిల్లులో చెలరేగిన మంటలు... 50వేల గన్ని బస్తాలు దగ్ధం - తెలంగాణ వార్తలు
నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లులో మంటలు చెలరేగాయి. 50 వేల గన్ని బస్తాలు దగ్ధమైనట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు.
రైస్ మిల్లులో చెలరేగిన మంటలు... 50వేల గన్ని బస్తాలు దగ్ధం
సకాలంలో స్పందించినందుకు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సర్పంచ్ సూర్యప్రకాశ్ రెడ్డి, రైస్ మిల్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:తిరుమలలో వీఐపీ బ్రేక్ టికెట్లు ఇప్పిస్తానంటూ మోసం