కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హైటెక్ మొబైల్ షాపులో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షాపులో నుంచి మంటలు రావడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
మొబైల్ దుకాణంలో అగ్నిప్రమాదం.. రూ.6 లక్షల ఆస్తినష్టం - kamareddy fire accident
కామారెడ్డిలోని సిరిసిల్ల రోడ్డులో గల హైటెక్ మొబైల్ దుకాణంలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనతో దుకాణంలో ఉన్న విలువైన మొబైల్ఫోన్లతో పాటు ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి.
కామారెడ్డి జిల్లాలో మొబైల్ దుకాణంలో అగ్నిప్రమాదం
వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక అధికారులు ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పారు. ఈ ప్రమాదంతో షాపులో ఉన్న రూ. 6లక్షల విలువైన సెల్ఫోన్లతో పాటు ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలను అగ్నిమాపక సిబ్బంది పరిశీలిస్తున్నారు.
- ఇదీ చూడండి :కూలీలపైకి దూసుకెళ్లిన ట్రక్కు-15 మంది మృతి