తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రెండు వర్గాల మధ్య గొడవ.. ఇనుపరాడ్లతో విచక్షణారహింతగా దాడులు - గుంటూరులో వైకాపా నేతల ఫైట్

వైకాపాలోని రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ రక్తసిక్తంగా మారింది. ఏపీలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెంలో ఈ ఘటన జరిగింది. ఓ స్థలం వివాదంలో రెండు వర్గాలకు చెందిన వారు కత్తులు, ఇనుపరాడ్లతో విచక్షణారహింతగా దాడులు చేసుకున్నారు. ఘర్షణలో 10 మందికి గాయాలు కాగా...ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

రెండు వర్గాల మధ్య గొడవ.. ఇనుపరాడ్లతో విచక్షణారహింతగా దాడులు
రెండు వర్గాల మధ్య గొడవ.. ఇనుపరాడ్లతో విచక్షణారహింతగా దాడులు

By

Published : Nov 25, 2020, 8:02 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెంలో వైకాపాలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ రక్తసిక్తంగా మారింది. గ్రామంలోని ముత్యాల వీరాంజనేయులు, రామిశెట్టి ఏడుకొండలు మధ్య నెలకొన్న స్థల వివాదం ఘర్షణకు దారితీసింది. వివాదాస్పద స్థలంలో వైకాపా నాయకుడు మీరం శ్రీనివాసరావు తన వర్గీయుడైన రామిశెట్టి ఏడుకొండలకు మద్దతుగా మంగళవారం బోరు​ వేసే ప్రయత్నం చేశాడు. ముత్యాల వీరాంజనేయులు తరఫున...మరో వైకాపా నాయకుడు ముత్యాల రామారావు బోరు వేయడాన్ని అడ్డుకోబోయారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో మీరం శ్రీనివాసరావు వర్గీయులు... ముత్యాల రామారావు వర్గానికి చెందిన వారిపై దాడి చేశారు. ఘటనలో ముత్యాల పిచ్చయ్య, ముత్యాల శ్రీనివాసరావు, దొడ్డంపూడి వెంకటేశ్వర్లు, తోట శివనాగ మణికంఠ, పోతురాజులకు గాయాలు కాగా... చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అక్కడ వారికి వైద్యులు, సిబ్బంది చికిత్స అందిస్తున్నారు.

రెండు వర్గాల మధ్య గొడవ.. ఇనుపరాడ్లతో విచక్షణారహింతగా దాడులు

ఆసుపత్రిలోనే దాడి

అదే సమయంలో ఘర్షణలో గాయాలపాలైన తన వర్గీయులను మీరం శ్రీనివాసరావు అదే ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. వచ్చిన వారికి ఓపి రాస్తున్న సమయంలో అప్పటికే చికిత్స పొందుతున్న ముత్యాల రామారావు వర్గీయులు కత్తులు, ఇనుప రాడ్లతో మీరం శ్రీనివాసరావు వర్గీయులపై ఆస్పత్రిలోనే దాడి చేశారు. ఈ సంఘటనతో వైద్యులు ,సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. కత్తులతో దాడి చేయడంతో మీరం శ్రీనివాస రావు మెడ, వీపు, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. అతనితో పాటు అతని వర్గీయులు ఏడుకొండలు, ఉప్పు చిన్నయమలయ్య, పగడాల శ్రీనివాసరావు, పగడాల కోటేశ్వరరావు, ఉప్పు వేణులకు గాయాలయ్యాయి. శ్రీనివాస రావుతో పాటు అతని వర్గీయులందరిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. శ్రీనివాస రావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

పోలీసుల అదుపులో నిందితులు

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యర్థి వర్గంపై దాడి చేసిన ముత్యాల రామారావు వర్గీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి నరసరావుపేట డీఎస్పీ చేరుకొని ఘటనస్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రి వైద్యులు సిబ్బంది నుంచి సమాచారం తెలుసుకున్నారు. చిలకలూరిపేట అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీచదవండి:పెట్రోల్​ పోసుకొని కాంగ్రెస్​ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..

ABOUT THE AUTHOR

...view details