హైదరాబాద్లోని వనస్థలిపురంలో కాలనీ వాసుల మధ్య వరద నీరు చిచ్చు పెట్టింది. అర్ధరాత్రి హరిహరపురం కాలనీలో ఉన్న నీరు వెళ్లడానికి... ఆ కాలనీవాసులు జేసీబీలతో కాలువలకు గండి కొట్టేందుకు యత్నించారు. హరిహరపురం కాలనీ కింద ఉన్న గాంధీ నగర్, స్నేహమయి నగర్ కాలనీ వాసులు దీన్ని అడ్డుకున్నారు.
వరద నీటి తంటాలు... కాలనీ వాసుల మధ్య గొడవలు
తమ కాలనీలోని వరద నీరు మళ్లించేందుకు గండి కొడుతుండగా... దిగువన ఉన్న కాలనీ వాసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కర్రలతో దాడి చేసుకోగా ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన వనస్థలిపురంలో చోటు చేసుకుంది.
వనస్థలిపురంలో కాలనీ వాసుల మధ్య చిచ్చు పెట్టిన వరద నీరు
ఇక్కడ నీరు పోయేందుకు గండి కొడితే... మా కాలనీలు ముంపునకు గురవుతాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హరిహరపురం వాసులు కర్రలతో దాడులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. హరిహరపురం కాలనీ ప్రెసిడెంట్ హనుమంత రెడ్డితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి:వరద నీటిలో చిక్కుకుని 100 గేదెలు మృత్యువాత