తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భారీగా ఎరువుల చోరీ.. కౌన్సిలర్ భర్త అరెస్ట్ - తెలంగాణ వార్తలు

మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం పరిశ్రమలవాడలోని ఓ గోదాములో 1200 ఎరువుల బస్తాలు చోరీకి గురయ్యాయి. వీటి విలువ దాదాపు రూ.11లక్షలు ఉంటుందని మేనేజర్ తెలిపారు. నిందితులను రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

fertilizer-theft-at-benkatadripalem-in-nalgonda-district
రూ.11లక్షలు విలువ చేసే ఎరువులు చోరీ!

By

Published : Dec 29, 2020, 5:25 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం పరిశ్రమలవాడలోని అవంతి గోదాములో 1200 ఎరువుల బస్తాలు చోరీకి గురయ్యాయి. దోపిడీకి పాల్పడిన 11 మంది నిందితులను మిర్యాలగూడ రూరల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. మిర్యాలగూడలోని ఇండస్ట్రీ ఏరియాలోని అవంతి గోదాములో ఈ నెల 6న 1200ల ఎరువుల బస్తాలు చోరికి గురయ్యాయని... వాటి విలువ దాదాపు రూ.11 లక్షల వరకు ఉంటుందని రూరల్ పోలీస్ స్టేషన్​లో గోదాము మేనేజర్ మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు... సోమవారం దాదాపుగా 1200 బస్తాలను రికవరీ చేశామని తెలిపారు.

ఈ చోరీలో 13 మంది పాల్గొన్నట్లు దర్యాప్తులో తేలిందని డీఎస్పీ వెంకటేశ్వర్ రావు తెలిపారు. నిందితులు రమావత్ భీమ్లా నాయక్, అతని కుమారుడు అరుణ్ అలియాస్ చంటి, మాలోతు హరి, రమావత్ కిషన్, రమావత్ హరి, రమావత్ నంద, రమావత్ రమేశ్, పానుగోతు కిషన్, మాలోతు రాజు, ధనావత్ రామారావు, మాలోతు బాబును అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించామని... మరి కొంతమందిని అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు. చోరీకి పాల్పడ్డ రమావత్ భీమ్లా నాయక్ తెరాస పార్టీకి చెందిన వార్డు కౌన్సిలర్ భర్త కావడం గమనార్హం.

ఇదీ చదవండి:ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీలో గొడవలు.. ఘర్షణలు

ABOUT THE AUTHOR

...view details