నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలిక పరిధిలోని ఓకాలనీలో నివాసం ఉంటున్న ఓవ్యక్తి తన కన్నకూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అది గమనించిన స్థానికులు అతనికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
కన్నకూతురి పట్ల తండ్రి అసభ్య ప్రవర్తన.. స్థానికుల దేహశుద్ధి - బాలికపై తండ్రి అత్యాచార యత్నం తాజా వార్త
రక్షణ, ధైర్యాన్నిస్తూ.. కట్టిరెప్పలా కాపాడుకోవాల్సిన సొంత తండ్రే తన పాలిట మృగంలా మారాడు. అసభ్యకరంగా ప్రవర్తించాడు. అది గమనించిన చుట్టుపక్కలవారు నిందితునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో చోటుచేసుకుంది.
బాధిత మైనర్ బాలిక తల్లి ఆరు సంవత్సరాల క్రితమే మరణించిందని స్థానికులు తెలిపారు. బాలికతో పాటు ఆమె చెల్లి ఇద్దరూ అచ్చంపేటలోని ఓప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్నారని వెల్లడించారు. అయితే ఇటీవల కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాల నుంచి వారిద్దరూ తండ్రి వద్దకు వచ్చారని చెప్పారు. కాగా సోమవారం రాత్రి మృగంలా మారిన అతను కన్నకూతురన్న విషయం మరచి ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక మేనమామ ఫిర్యాదు మేరకు నిందితునిపై పోక్సోకేసు నమోదు చేసినట్లు కల్వకుర్తి సీఐ సైదులు యాదవ్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:వృద్ధురాలి హత్యకేసు మిస్టరీ... మనువడే నిదింతుడు..