కన్న కొడుకునే తండ్రి కొట్టి చంపిన విషాద ఘటన... సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తాలలో చోటుచేసుకుంది. బండగొర్ల ఈదప్ప, అతని చిన్న కుమారుడు శ్రీశైలం... ఇద్దరూ గ్రామంలో రెండు ప్రధాన పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఊర్లో జరిగిన ఓ గొడవకు సంబంధించి... చెరో వర్గం తరఫున పెద్దమనుషులుగా వెళ్లారు. రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత... ఇదే విషయం చర్చించే క్రమంలో ఇద్దరికి వివాదం తలెత్తింది.
ఊర్లో గొడవకి.. తండ్రి చేతిలో కొడుకు బలి - తండ్రీకొడుకుల మధ్య వివాదం
క్షణికావేశం.. కన్న కొడుకునే చంపుకునేలా చేసింది. ఊర్లో పంచాయితీ తండ్రీకొడుకులు మధ్య వివాదానికి దారితీసింది. మాటామాట పెరిగి కలబడ్డారు. కొడుకు తలపై తండ్రి బలంగా కొట్టగా... అక్కడికక్కడే ప్రాణాలు వదిలన విషాదం సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తాలలో చోటుచేసుకుంది.
మాటామాట పెరిగి తండ్రీకొడుకుల మధ్య వివాదం ముదిరింది. శ్రీశైలం లేచి తండ్రిని తన్నాడు. తండ్రి ఆవేశంతో కొడుకు తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రామై... శ్రీశైలం రక్తపు మడుగులో కుప్పకూలాడు. గమనించిన చుట్టుపక్కలవారు... ఆర్ఎంపీ దగ్గరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో గ్రామానికి చేరుకున్న నాగారం ఎస్సై... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈదప్ప ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.